సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలి

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

ఆదిలాబాద్‌టౌన్‌: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అ న్నమొల్ల కిరణ్‌ అన్నారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్‌లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాద, సహజ మరణం, శాశ్వత, పా క్షిక అంగవైకల్యానికి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించడంతో నిర్మాణ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో నం.12 రద్దు చేసి సంక్షేమ పథకాల అమలును వెల్ఫేర్‌ బోర్డుకే అప్పగించాలని, రెన్యువల్‌ కాని 13 లక్షలకు పైగా లేబర్‌ కార్డులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో దిశాంత్‌, అశోక్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement