హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి

Jul 19 2026 11:33 PM | Updated on Jul 19 2026 11:33 PM

ఆదిలాబాద్‌టౌన్‌: కార్మికులు హక్కుల సాధనకు మిలిటెంట్‌ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బజరంగ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల అమలు, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భారతల గోవర్ధన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement