ఆదిలాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీఎన్‌ఆర్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం అండర్–16, అండర్–19 విభాగాల్లో జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. టీసీఏ ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ నరోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు వచ్చే నెలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కమిటీ సభ్యులు అమిత్ డోక్వాల్, యూసుఫ్‌ఖాన్, రమేశ్, డాక్టర్ కేమ శీను సెలక్షన్ కమిటీ సభ్యులు రామరాజు, హర్ష, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


