ఆదిలాబాద్‌టౌన్: నీట్ ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులు ప్ర తిభ కనబర్చారు. 720మార్కులకు గాను పెర్క సంజన 501,వైలె దివ్య 449, వొర్స సాయితేజ 405, గోడ్సే అక్షర 344, ఎస్.మయూరి 329, జ్యోత్స్న 324, అక్షర 322 మార్కులు సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి తె లిపారు. విద్యార్థులు ఎలాంటి కోచింగ్ లేకుండా మంచి మార్కులు సాధించారని పేర్కొన్నా రు. ఇంటర్ చదువుతూనే ఏటా పదుల సంఖ్య లో విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో అర్హత సా ధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. డీన్ రాంబాబు, ప్రిన్సిపాల్‌లు జైపాల్‌రెడ్డి, అరవింద్, లలిత తదితరులున్నారు.


