‘విడతలవారీగా అభివృద్ధి చేస్తా’ | - | Sakshi
Sakshi News home page

‘విడతలవారీగా అభివృద్ధి చేస్తా’

Jul 17 2026 3:40 AM | Updated on Jul 17 2026 3:40 AM

గుడిహత్నూర్‌: కొల్హారి గ్రామాన్ని విడతల వారీగా అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ హామీ ఇచ్చారు. మండలంలోని కొల్హారి గ్రామంలో రూ.18లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏ ర్పాటు చేసి వాటి సమగ్రాభివృద్ధికి పాటుపడినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లెకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు అల్లూరి శివాజీ, ప్రతా ప్‌సింగ్‌ రాథోడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌ ముండే, మాజీ సర్పంచులు తిరుమల్‌గౌడ్‌, రవినాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గజానంద్‌ పాటిల్‌ గిత్తే, తగ్రే ప్రకాశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే..

నేరడిగొండ: తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. బజార్‌హత్నూర్‌ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఫడ్‌ జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో కేంద్రే బాలాజీ గురువారం బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చే రారు. మండలంలోని బలాన్‌పూర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు తులసీరాం ఆధ్వర్యంలో పలువురు వార్డు మెంబర్లు గులాబీ గూటికి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్నది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంజేశారు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement