ఇచ్చోడ: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సిరిచెల్మలో ఉదయం 6నుంచి 9గంటలకు వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఎస్పీ హాజరయ్యారు. అసాంఘిక కార్యకలాపా ల సమాచారం తెలిస్తే 8712659973 నంబర్‌కు వాట్సప్ ద్వారా తెలుపాలని సూచించారు. కార్డన్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 156 బైక్‌లు, రెండు ఆటోలు, ఎనిమిది కార్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగించే క్వింటాల్ అమ్మోనియం బై కార్బోనెట్‌ను స్వాధీనం చేసుకుని నిల్వ చేసిన సురేందర్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమో దు చేసి 200 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంకటనర్సయ్య, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ఇచ్చోడ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ నరేశ్, రిజ ర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, మురళి, వివిధ ఠాణాల ఎస్సైలు, 120 మంది సిబ్బంది పాల్గొన్నారు.
మారుతిగూడలో..
ఆదిలాబాద్(బేల): మండలంలోని మారుతిగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సె ర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో లీటర్ గుడుంబా, తయారీకి ఉపయోగించే పాత్రలను స్వాధీనం చేసుకుని ధ్వంసంచేశారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన ద్రావణాన్ని పారబోశా రు. నిబంధనలు పాటించని, సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తుల కదలికలను గమనించేందుకు గ్రామంలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించా రు. జైనథ్ సీఐ శ్రావణ్‌కుమార్, ఎస్సైలు మధుకృష్ణ, గౌతమ్, పీర్ సింగ్‌నాయక్ పాల్గొన్నారు.


