ఐటీఐ–ఏటీసీ విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ–ఏటీసీ విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు

Jul 17 2026 3:40 AM | Updated on Jul 17 2026 3:40 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రపంచ యువ నైపుణ్య దినో త్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌గల ఆదివాసీ భవన్‌–బంజారా భవన్‌లో గురువా రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఉట్నూర్‌ ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ ఇస్తూ, ఉపాధి కల్పనలో దూసుకుపోతున్న ఉట్నూర్‌ ఐటీఐ–ఏటీసీ ప్రతి భను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అ తిథిగా హాజరై ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ ఉట్నూర్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ లెటర్లు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఉట్నూర్‌ ఐటీఐ పనితీరును మంత్రి ప్ర శంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, పరిశ్రమలతో అనుసంధానానికి, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో విశేష కృషి చేసిన ఉట్నూర్‌ ప్రిన్సిపాల్‌ రొడ్డ శ్రీనివాస్‌ను మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలో శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement