కై లాస్‌నగర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ప్రత్యేక చొరవ తీసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.


