నిఘా నీడ ప్రభావం సెకండియర్‌లో రాష్ట్రస్థాయిలో 33.. ఫస్టియర్‌లో 32వ స్థానం గతేడాదితో పోల్చితే మరింత అధ్వానం మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఆదిలాబాద్‌టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆ దిలాబాద్ జిల్లా ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏ ర్పాటుతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లే కుండా పోయింది. ఈ ప్రభావం ఫలితాలపై పడినట్లుగా తెలుస్తోంది. పదో తరగతిలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించిన ఈ విద్యార్థులే ఇంటర్‌లో వెనుకబడడం గమనార్హం. ఆదివారం వెల్లడైన ఫ లితాల్లో జిల్లా ప్రథమ సంవత్సరం ఏకంగా 32వ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరం 33వ స్థానానికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
సెకండియర్‌లో మరింత దారుణం..
గతేడాదితో పోల్చితే సెకండియర్ ఫలి తాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఏకంగా 21 స్థానాలకు పడిపోవడం విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నిస్తోంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 33వ స్థా నంలో నిలిచింది. జనరల్ కోర్సులో 7518 మంది హాజరు కాగా, 4,699 మంది ఉత్తీర్ణులయ్యారు. 62. 50 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,647 మందికి గాను 1847 మంది (50.64 శాతం)పాసయ్యారు. బాలికలు 3,871 మందికి గాను 2852 మంది పాస్ అయ్యారు. 73.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 69.57 శాతం నమోదు కాగా ఈ సారి 7.07 శాతం తగ్గింది. ఒకేషనల్‌లో 905 మంది పరీక్షలు రాయగా 669 మంది పాసయ్యా రు. ఉత్తీర్ణత శాతం 73.92గా నమోదైంది. ఇందులో బాలురు 63.03 శాతం, బాలికలు 81.02 శాతంగా ఉంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానంలో నిల
వగా, ఈసారి 18కి పడిపోయింది. ద్వితీయ సంవ
త్సరంలో ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) జనరల్ కోర్సులో 452 మంది రాయగా, 162 మంది ఉత్తీర్ణులయ్యారు. 35.85 శాతం నమోదైంది. ఒకేషనల్ కోర్సులో ప్రైవేట్ విద్యార్థులు 53 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది పాస్ అయ్యారు. 28.30 శాతం నమోదైంది.
మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు డీఐ ఈవో జాదవ్ గణేశ్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వి తీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 13 నుంచి 20 వరకు చెల్లించేందుకు గడువు ఉందన్నారు. రీకౌంటింగ్ కోసం ప్రతీ పేపర్‌కు రూ.100, రీవెరిఫికేషన్, స్కానింగ్ కాపీ కోసం రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫె యిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చని తెలిపారు.
సర్కార్ కళాశాలల ఫలితాలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బజార్‌హత్నూర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. 86 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో టాప్‌లో నిలిచారు. అలాగే బేలలో 85.51 శాతం, నేరడిగొండ 78.79 శాతం, తాంసిలో 77.6 శాతం ఉత్తీర్ణులయ్యారు. తక్కువ శాతం ఉత్తీర్ణత అయిన కళాశాలల్లో ఉట్నూర్ 26.25 శాతం, ఆదిలాబాద్ బాలుర కళాశాలలో 35.69 శాతం, నార్నూర్ 41 శాతం, గుడిహత్నూర్‌లో 44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.
ఫస్టియర్ ఐదు స్థానాలు డౌన్..
ప్రథమ సంవత్సరం ఫలితాలు గతేడాదితో పోల్చితే మరో ఐదు స్థానాలు దిగజారింది. జనరల్ కోర్సులో 7,701 మంది పరీక్షకు హాజరు కాగా, 3,910 మంది ఉత్తీర్ణులయ్యారు. 50.77 ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 2.3 శాతం తగ్గింది. బాలుర ఉత్తీర్ణత 36.87 శాతం కాగా.. బాలికలది 64.13 శాతంగా నమోదైంది. ఒకేషనల్ కోర్సులో 935 మందికి గాను 620 మంది ఉత్తీర్ణత (66.31 శాతం)సాధించారు. ఇందులో బాలురది 53.37 శాతం ఉత్తీర్ణత కాగా.. బాలికలది 75.41 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయిలో ఒకేషనల్ కోర్సులో 9వ స్థానం నిలిచింది. గతంతో పోల్చితే ఆరు స్థానాలు పడిపోయాయి.


