హంగ్‌ తప్పదా? | - | Sakshi
Sakshi News home page

హంగ్‌ తప్పదా?

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

హంగ్‌ తప్పదా?

హంగ్‌ తప్పదా?

నేడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మెజార్టీకి దూరంగా కాంగ్రెస్‌, బీజేపీ? తేల్చి చెప్పిన వివిధ సర్వే రిపోర్టులు కింగ్‌మేకర్‌ తామేనంటున్న బీఆర్‌ఎస్‌ ఎంఐఎం మద్దతు ఏ పార్టీకి దక్కేనో?

సాక్షి, ఆదిలాబాద్‌: మరికొద్ది గంటల్లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుందో తేలిపోనుంది. కాంగ్రెస్‌, బీజేపీ అధిక వార్డుల్లో గెలుపొందుతాయని, మెజా ర్టీ మాత్రం అందుకోలేకపోతాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల్లో ఏదైనా అత్యధిక వార్డుల్లో గెలుపొంది పాలకవర్గం ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు అనుకూలంగా కలిసి వచ్చే పార్టీలకు సీట్లు దక్కుతాయా..? బీ ఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎన్ని వార్డుల్లో గెలుపొందుతా యి..? ఏఐఎఫ్‌బీ, స్వతంత్రులు ఎంతమంది గెలు స్తారు..? పాలకవర్గం ఏర్పాటులో వారి నిర్ణయం ఎలా ఉంటుంది..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానంరావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

‘క్యాంప్‌’ రాజకీయాలు షురూ..

ఒకవైపు సంపూర్ణ మెజార్టీ సాధించి పాలకవర్గం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌, బీజేపీ చెబు తున్నాయి. మరోవైపు వేర్వేరుఏజెన్సీ సర్వే రిపోర్ట్‌లు ఈ పార్టీల లెక్కలకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి కే ఆ పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులను క్యాంపులకు త రలించారు. మెజార్టీ వస్తుందని చెబుతున్నా ఆ రెండు పార్టీలు ఇంత జాగ్రత్తగా వ్యవహరించడం వెను క మతలబు లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. సర్వేలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో అలాంటి ఫలితా లే వస్తాయా..? లేదా..? పాలకవర్గం ఏర్పాటుకు స రిపడా కౌన్సిలర్లు గెలవని పక్షంలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి..? మరి ఆ పార్టీలు ఎంతమంది అభ్యర్థులను గెలుస్తుంది..? అన్నీ అనువైన పరిస్థితులు ఏర్పాడతాయా..? ఈనెల 16న నిర్వహించ

నున్న మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం వరకు అన్ని స ర్దుకుంటాయా..? ఇలా అనేక అంశాల్లో వ్యవహారా లు సాగాల్సి ఉండగా, తమ పార్టీ నుంచి గెలిచిన అ భ్యర్థులు చేజారకుండా క్యాంపునకు తరలించారు.

ఎవరి ధీమా వారిదే..

మున్సిపల్‌ ఫలితాలపై వివిధ ఏజెన్సీల సర్వే రిపోర్ట్‌లు ఎలా ఉన్నా.. ఆయా పా ర్టీలు మాత్రం దేనికవే ధీమా వ్య క్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఐదు నుంచి ఎనిమిది వార్డుల వరకు గెలువవచ్చని ఏజెన్సీల సర్వే రి పోర్టులు చెబుతుండగా, ఆ పార్టీ మాత్రం తాము 15వార్డుల్లో గెలు స్తామని, పాలకవర్గం ఏర్పాటులో తామే కింగ్‌ మేకర్లమని ధీమాగా ఉన్నాయి. ఎంఐఎం మూడు వార్డుల్లో గెలువవచ్చని సర్వే రిపోర్టులు చెబుతుండగా ఏడు నుంచి 11వార్డులు గెలుస్తామని ఆ పార్టీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. బీజేపీ మినహా యిస్తే ఏ పార్టీ అయినా పాలకవర్గం ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని ఎంఐఎం స్పష్టం చేస్తోంది. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి ఎవరైనా గెలుస్తారా..? స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే వారి పాత్ర ఎంత మేరకు కీలకమవుతుంది? అనేదానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠ వీడనుంది.

మున్సిపల్‌ పీఠం ఎవరిదో?

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 49వార్డులున్నాయి. పాలకవర్గం ఏర్పాటు చేయాలంటే 25మ్యాజిక్‌ ఫిగర్‌ కావాలి. అయితే, ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఆదిలాబాద్‌లోనే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 26గా మారింది. జనరల్‌ మహిళకు చైర్‌పర్సన్‌ పదవి రిజర్వ్‌ చేశారు. ఈ నెల 16న మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు గెలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. అప్పటివరకు రాజకీయంగా హైడ్రామా కొనసాగనుంది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement