జోరుగా ‘క్యాంపు’ రాజకీయాలు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్ర క్రియ ముగిసినా రాజకీయ వేడి ఇంకా చల్లారడం లేదు. ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టనున్నారు. అయితే, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అవసరమైన అధిక్యం ఏ పార్టీకి రావడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేలా అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆ పార్టీ ముఖ్యనేతలు దగ్గరుండి మరీ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. ఓడిన అభ్యర్థులను తిరిగి పంపించనుండగా గెలిచిన వారిని ఈ నెల 16న నిర్వహించే మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ పార్టీ కొంతమంది అభ్యర్థులను తీసుకెళ్లకపోవడంతో వారిలో ఓటమి ఆందోళన వ్యక్తమవుతోంది.
అయోధ్యకు బీజేపీ అభ్యర్థులు!
చైర్మన్ పీఠాన్ని తామే కై వసం చేసుకుంటామని బీజేపీ, కాంగ్రెస్ బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం ఫలితాలపై కాస్తా ఆందోళనే కని పిస్తోంది. ఈ నేపథ్యంలో గెలిచిన కౌన్సిలర్లు ఇత ర పార్టీల వైపు వెళ్లకుండా ఉండేలా నాయకులు జాగ్రత్తపడుతున్నారు. బీజేపీ తరఫున 49మంది అభ్యర్థులు పోటీ చేయగా 38మందినే ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. కౌన్సిలర్ అభ్యర్థులు, వారి కుటుంబీకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసారించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం వారిని మూడు ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలించారు. వీరిని అయోధ్య తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. గెలిచే అవకాశమున్న వారినే క్యాంపులకు తీసుకెళ్లారనే చర్చ సాగుతోంది.
హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు!
అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 49 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. ఆ పార్టీ ముఖ్యనేతలతో కలిసి వార్డులవారీగా నమోదైన పోలింగ్ సరళి, అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించా రు. ఫలితాల అనంతరం అనుసరించాల్సిన కా ర్యాచరణపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అనంతరం రెండు ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధానికి తరలించారు. అక్కడి ఓ రిసార్టులో ఉంచి ఫలితాలు వెలువడిన అనంతరం విజేతలను మ రోచోటకు తరలిస్తారని తెలిసింది. అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యులంతా వెళ్లడం గమనార్హం.
ఆచీతూచి వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ కూడా తమ కౌన్సిలర్ అభ్యర్థులను శిబి రానికి తరలించాలని తొలుత భావించింది. గురువారమే అభ్యర్థులను తరలిస్తారనే ప్రచారం కూ డా జరిగింది. అయితే, ఈ విషయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ఎ న్నికల ఫలితాలు వెలువడ్డాక ఆయా పార్టీలకు వ చ్చే సీట్ల ఆధారంగా క్యాంపునకు వెళ్లాలా? లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థులను శిబిరానికి తరలిస్తారనే చర్చ సాగుతోంది.


