బాల్య వివాహాలను అరికట్టాలి
తాంసి: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా సఖీ కేంద్రం అధికారి నాగమణి సూచించారు. గురువా రం ‘బాల్య వివాహాల రహిత భారతదేశం 100 రో జుల కార్యక్రమం’లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని కప్పర్ల, బండల్‌నాగాపూర్, పిప్పల్‌కోటి పాఠశాలల్లో విద్యార్థినులకు బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006, గృహహింస, పోక్సో చట్టం, సైబర్‌క్రైంతో పాటు సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలను వివరించారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు


