కలెక్టరేట్ ఎదుట కార్మికసంఘాల ధర్నా
కై లాస్‌నగర్: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల ను రద్దు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధ ర్నా చేశారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ని రసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని కార్మిక సంఘా ల నాయకులు ఆరోపించారు. రైతులకు ఉపాధి, వ్యవసాయ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి వీబీ జీ–రామ్ జీ స్కీమ్ తెచ్చి రాష్ట్రాలపై ఆర్థికభారం మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులున్నారు.


