మాలలు ప్రాతినిధ్యం వహించాలి
తలమడుగు: రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాల సంక్షేమ సంఘం నాయకులు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబేడ్కర్ సంఘాల ఐక్య పోరాట సంఘం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమ్మన్న పేర్కొన్నారు. గురువారం మండలకేంద్రంలో జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నికై న మాల సర్పంచులు, ఉపసర్పంచులకు మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న మాల సర్పంచులు, ఉపసర్పంచులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఎన్నికై న సర్పంచులు బాధ్యతగా పనిచేయలని సూచించా రు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, గజానన్, అర్ష దేవిదాస్, ప్రభుదాస్, బొంకటి సుభాష్, అర్ష రమేశ్, అయిండ్ల శశికాంత్, ఎల్పుల భూమన్న, బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, చంటి, యాసంత్, నారాయణ, కుమ్మరి సత్యనారాయణ, బత్తుల విశ్వంభర్, తలమడుగు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి ముత్యాల రవి, కాడే శ్రీనివాసు, నేతుల గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


