పల్లెల్లోనూ కమలం హవా!
సాక్షి, ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడినప్పటికీ ఫలితాలపై బీజేపీలో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో సర్పంచ్ స్థానాలు నామమాత్రంగా వచ్చేవని, ఈసారి పార్టీ మద్దతుదారులు ఎ క్కువ సంఖ్యలో గెలవడమే అచీవ్‌మెంట్ అని క మలం శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇదే ఊపును ‘పరిషత్’ ఎన్నికల్లో చాటాలని భావిస్తున్నాయి. బీజే పీ సర్పంచుల సమ్మేళనం శుక్రవారం ఆదిలాబాద్‌లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రానున్నారు. బీజేపీలో ఈ పరిణామం ఉత్సాహం కలిగిస్తోంది.
జిల్లాలో 80 సర్పంచ్ స్థానాలు..
ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలో సుమారు 80 సర్పంచ్ స్థానాలు గెలిచినట్లు కమలం పార్టీ స్పష్టం చేస్తోంది. ఆదిలాబాద్ ని యోజకవర్గంలో ఏకంగా 58స్థానాలు గెలిచినట్లు నా యకులు చెబుతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి బీ జేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. కిందటి పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఐదు జెడ్పీటీసీ స్థానాలతో పాటు పలు ఎంపీపీ స్థానాలనూ కై వసం చేసుకుంది. ప్రస్తుతం గ్రామాల్లో పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తోందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదిలాబాద్‌కు వస్తున్నారు. బీజేపీ సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. పార్టీలో ఈ కార్యక్రమంపై శ్రేణులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నాయి.


