‘మనుధర్మాన్ని వ్యతిరేకించాలి’
ఆదిలాబాద్‌టౌన్: మనుధర్మ శాస్త్రం మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించి ముందుకెళ్లకుండా చేసిందని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేశ్ ఆరోపించారు. గురువా రం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయం ఎదుట ప్రజాసంఘాలు, కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుధర్మం ప్రతులు దహనం చేశారు. మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1927 డిసెంబర్ 25న రాజ్యాంగ నిర్మాత బా బాసాహెబ్ అంబేడ్కర్ దాన్ని దహనం చేశార ని గుర్తు చేశారు. నేటికీ దళితులపై అంటరాని తనం, అగ్రవర్ణాల ఆధిపత్యం ఉందంటే అది మనుధర్మ శాస్త్రంతోనే అని పేర్కొన్నారు. అంటరానితనం, వివక్ష పోవాలనే ఉద్దేశంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. కేవీపీఎస్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, మనుధర్మాన్ని మానవతావాదులు వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు, కేవీ పీఎస్ నాయకులు జితేందర్, బండి దత్తాత్రి, లంక రాఘవులు, సురేందర్, ఆశన్న, నెల్ల స్వా మి, రాములు తదితరులు పాల్గొన్నారు.


