అది మా భూమే.. కాదు మా భూమే
రెవెన్యూ, అటవీశాఖలు పట్టు వివాదాస్పదంగా మారిన దానం చేసిన భూమి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శాపంగా మారిన వైనం
సాత్నాల: మండలంలోని దుబ్బగూడలో పేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఆత్రం లేతుబాయి అ నే గిరిజన మహిళ దానం చేసిన భూమి వివా దాస్పదంగా మారింది. ఆ భూమిలో ఆదివాసీలు ఇళ్ల ని ర్మాణాలు ప్రారంభించగా అటవీశాఖ అధికారులు అడ్డుపడ్డారు. ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వస్తుందని,ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మా త్రం అది పట్టా భూమి అని చెబుతున్నారు. లేతుబాయి పేరిట మూడెకరాలకు పట్టా ఉందని అందులో ఎకరం ఇందిరమ్మ ఇళ్ల కోసం దానం చేశారని పేర్కొన్నారు. అందులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందు కు ఎలాంటి అవరోధం లేదని అంటున్నారు. లబ్ధి దారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచిస్తుండగా.. అటవీశాఖ అధికారులు మాత్రం అది ముమ్మాటికి తమ భూమేనని అనుమతుల్లేకుండా నిర్మాణాలు చే పట్టడం అక్రమమే అవుతుందని పేర్కొనడం గమనార్హం. ఇరుశాఖల భిన్నమైన ప్రకటనలతో ఆది వా సీల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అందుకో సం తెచ్చిన సామగ్రి అలంకారప్రాయంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


