విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
సిరికొండ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆది వారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే బాధితుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. అనంతరం మండలంలోని కన్నాపూర్‌లో గ్రామస్తులకు దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఎస్సై పూజ, సిబ్బంది పాల్గొన్నారు.


