ఖోఖోకు మరింత ప్రాచుర్యం
ఉట్నూర్‌రూరల్: కామన్వెల్త్ క్రీడల్లో చోటు లభించడంతో ఖోఖోకు మరింత ప్రాచుర్యం లభిస్తోందని రాష్ట్ర ఖోఖో అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన తెలంగాణ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక తుది పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసియా క్రీడల్లోనూ ఖోఖోకు చోటు కల్పించేందుకు ఫెడరేషన్ కృషి చేస్తోందన్నారు. ఎంపికైన వారు బెంగుళూరులో డిసెంబర్ 31 నుంచి జనవరి 5 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల జాబితా ప్రకటించారు. బాలుర విభాగంలో ఎం.నిఖిల్, ఎస్.శంకర్, ఆకాశ్, యాదవ్ షావ్, శ్రావణ్‌కుమార్, కార్తిక్‌కుమార్, జగన్, వెంకటసాయి, పార్థసారథి, సీహెచ్ మాసియా, సంపత్‌నాయక్, శ్యాం, సతీశ్‌కుమార్, నిఖిల్, జె.అనిల్, జైస్వాల్, అరవింద్, త్రిశాల్‌లు ఎంపిక కాగా.. బాలికల జట్టులో సోని, శ్రీలత, వైష్ణవి, నాగేశ్వరి, సీహెచ్ జంగుబాయి, శ్రీలక్ష్మి, శశిరేఖ, స్వేత, లహరి, చందన, వైష్ణవి, కీర్తన, మేఘన, నవ్యశ్రీ, హర్షిణి, సత్యశీల, మైథిలి, మహలక్ష్మిలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా గిరిజన క్రీడల అధికారి కే. పార్థసారథి, ఖోఖో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి దయానంద్‌రెడ్డి, రాము, గంగా, హేమంత్, శ్రీనివాస్, రవీందర్, శంకర్, గణేశ రవి, కోచ్‌లు శివకృష్ణ, తిరుమల ఉన్నారు.


