చూస్తారు.. క్షణాల్లో గీస్తారు!
ఇచ్చోడలోని తెలంగాణ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఔరా అనిపిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన పలువురు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. లైవ్‌ఆర్ట్స్‌లో అద్బుతమైన చిత్రాలు గీస్తున్నారు. వారు చూసిన దృశ్యాన్ని క్షణాల వ్యవధిలోనే బొమ్మలాగా మార్చేస్తూ అబ్బురపరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్‌ఫేర్‌కు హాజరైన శ్రీకాంత్, మనోజ్, ప్రవీణ్, అభిరాం, అఖిల్‌లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల చిత్రాలను గీసి శభాష్ అనిపించుకున్నారు. ఆర్ట్స్‌టీచర్ కృష్ణ పర్యవేక్షణలో వీరు ఈ కళానైపుణ్యం సాధించారు.
– ఆదిలాబాద్‌టౌన్
చూస్తారు.. క్షణాల్లో గీస్తారు!
చూస్తారు.. క్షణాల్లో గీస్తారు!


