లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి
ఆదిలాబాద్‌రూరల్: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని మామిడిగూడ బాలి కల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు శనివారం స్వెట్టర్లు, షూ, సాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీడీ అంబాజీ, ఏటీడీవో నిహారిక, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
1నుంచి జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు
కై లాస్‌నగర్: జిల్లాలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందు కోసం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 31వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. రహదారి భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎస్పీ అఖి ల్ మహాజన్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ ఆర్‌ఎం భ వానీ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.


