బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆర్‌పీఎల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం జేజేబీ కోర్టు, చైల్ట్ లైన్, ఐసీపీఎస్, ష్యూర్ ఎన్జీవోలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్నవారు ధైర్యంగా 1098, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బ్యాగులను బహుమతిగా అందజేశారు. ఇందులో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీశ్‌కుమార్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, సూపర్‌వైజర్ సంపత్, కిరణ్, హెచ్‌ఎంలు బొర్రన్న, మల్లయ్య, ఆరీఫ్, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.


