డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్
నిర్మల్‌టౌన్: తెలంగాణ డెంటల్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం, కొండాపూర్ సమీపంలోని గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్ మ్యాచ్ సీజన్ –5 నిర్వహించారు. ఈ పోటీలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇందులో ఆ దిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ని జామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను నిర్మల్ డాక్టర్స్ అసోసియేష న్ అధ్యక్షుడు ము రళి, సీనియర్ డాక్టర్ అప్పాల చక్రధరి, రమేశ్ రెడ్డిలు ముందుగా టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ వెంకటరమణ, డాక్టర్ అసోసియేషన్ మెంబర్స్ రామకృష్ణ, నమిత, సుభాశ్ రావు పాల్గొన్నారు.


