కల్తీ గుర్తించవచ్చు
ప్రస్తుతం మార్కెట్‌లో ఆహార పదార్థాలతో పాటు అన్ని వస్తువులు కల్తీమయం అవుతున్నాయి. చాలా మంది వీటిని తిని అనారో గ్యం బారిన పడుతున్నారు. ఈ కల్తీ వస్తువులను గుర్తించేందుకు మేం ప్రయోగం చేశాం. పాలను కర్రచెక్కపైన జారవిడిస్తే నీళ్లు కలుపని పాలు చెక్కకు అతుక్కుంటాయి. కల్తీ పాలు వెళ్లిపోతాయి. నెయ్యిలో అయోడిన్ వేయడం ద్వారా రంగు మారితే కల్తీ అయినట్లే. కల్తీ నెయ్యిని అగ్గిపుల్లతో వెలిగి స్తే అది వెలుగదు. ఆయిల్‌లో నైట్రిక్‌యాసిడ్ వేస్తే కల్తీ నూనె ఎర్రటి రంగులోకి మారుతుంది. – చైతన్య, బి.నిత్య,
శ్రీచైతన్య స్కూల్, ఆదిలాబాద్


