విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్‌టౌన్: విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని అదనపు కలెక్టర్ ఫైజా న్ అహ్మద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడలను ప్రారంభించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో 50 మంది బాలికలు, 100 బాలురు పాల్గొన్నారు. పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


