మూడు విడతల్లో.. పంచాయతీ
జిల్లాకు చేరిన బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక 25 శాతంతో బీసీల ముసాయిదా రిజర్వేషన్ల ఖరారు నోటిఫికేషన్ రావడమే తరువాయి
కైలాస్‌నగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఈమేర కు యంత్రాంగం అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. తొలి విడతలో ఏజెన్సీ మండలాలను కేటా యించారు. మిగతా మండలాల్లోని పంచాయతీల కు రెండు, మూడో విడతల్లో నిర్వహించనున్నా రు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా రిజర్వేషన్లు 50శా తం పరిమితి దాటకుండా బీసీల రిజర్వేషన్లను శుక్రవారం ఖరారు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా యంత్రాంగం పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతుంది. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 23న ప్రకటించనున్నారు.
బీసీ డ్రాఫ్ట్ రిజర్వేషన్ల ఖరారు..
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ అధికారి బుసాని వెంకటేశ్వర్‌రావు అధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలో పర్యటించి బీసీల సామాజిక, విద్య, ఆర్థిక వెనుకబా టుపై అధ్యయనం చేసింది. ఈ కమిటీ సిద్ధం చేసిన నివేదిక జిల్లాకు చేరింది. ఇది వరకు బీసీలకు 42శా తం రిజర్వేషన్లను ఖరారు చేయగా రిజర్వేషన్ల పరి మితి 50శాతం దాటకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పరిమితికి లోబడి బీసీల రిజర్వేషన్ల ఖరా రుకు అధికారులు కసరత్తు చేపట్టారు. జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో జి.రమేశ్ అధ్వర్యంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై గ్రామం, వార్డుల వారీగా బీసీల డ్రాఫ్ట్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించాక మహిళ, జనరల్ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 25శాతం కేటాయించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి విడతలో ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాలుగు ఏజెన్సీ మండలాలతో పాటు ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెండు మండలాల్లోని 166 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆరు, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లోని 156 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. చివరి విడతలో ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో గల 151 గ్రామ పంచాయతీలు, అక్కడి వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
పోలింగ్ కేంద్రాలు కూడా ...
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 3,888 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 3,888 మంది పీవోలు, 4,556 ఓపీవోలను నియమించారు. నోటిఫికేన్ వచ్చాక వీరందరికీ విడతల వారీగా ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు. పొరపాట్లకు తావులేని ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని భావించిన ఎన్నికల సంఘం మార్పులు, చేర్పుల సవరణకు ఆదేశించింది. వాటిని సరిచేసి ఈ నెల 23న తుది జాబితా ప్రకటించనుంది.
జిల్లాలో
గ్రామ పంచాయతీలు : 473
మొత్తం వార్డులు : 3,870
విడతల వారీగా ఎన్నికల వివరాలు
విడత పంచాయతీలు
తొలి 166
రెండో 156
మూడో 151
రెండో విడతలో
ఆదిలాబాద్ 31
మావల 03
బేల 31
జైనథ్ 17
సాత్నాల 17
భోరజ్ 17
తాంసి 14
భీంపూర్ 26
మూడో విడతలో ..
మండలం పంచాయతీలు
బోథ్ 21
సొనాల 12
బజార్‌హత్నూర్ 31
నేరడిగొండ 32
గుడిహత్నూర్ 26
తలమడుగు 29
తొలి విడతలో ...
మండలం పంచాయతీలు
ఇంద్రవెల్లి 28
ఉట్నూర్ 38
నార్నూర్ 23
గాదిగూడ 25
సిరికొండ 19
ఇచ్చోడ 33


