పైసలు రాలే.. | - | Sakshi
Sakshi News home page

పైసలు రాలే..

Nov 22 2025 7:30 AM | Updated on Nov 22 2025 7:30 AM

పైసలు

పైసలు రాలే..

సోయా అమ్మిన రైతుల ఎదురుచూపు రోజులు గడుస్తున్నా పట్టించుకోని మార్క్‌ఫెడ్‌ యాసంగి పెట్టుబడికి తంటాలు

సాక్షి,ఆదిలాబాద్‌: పంట దిగుబడులను విక్రయించిన సోయా రైతులు డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రోజులు గడిస్తున్నా పైసలు రాకపోవడంతో పరేషాన్‌ అవుతున్నారు. యాసంగి సాగుకు అప్పులు చేయాల్సిన దుస్థితి . కొంత మంది బంగారం కుదువ పెట్టుకుంటున్నారు. మరికొంత మంది అత్యధిక వడ్డీకి ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో పంట డబ్బులు చేతికందితే ఈ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

ఈ నెల 2 నుంచి కొనుగోళ్లు..

జిల్లాలో ఈనెల 2న సోయా కొనుగోళ్లు మొదలయ్యాయి. దేశంలో నాఫెడ్‌ ఆధ్వర్యంలో, రాష్ట్రంలో దానికి అనుబంధంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపడుతున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పంటను విక్రయించిన రైతులకు డబ్బులు జమ కాలేదు. ప్రైవేట్‌కు విక్రయిస్తే తక్కువ ధర లభిస్తుందని భావించిన రైతులు మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు సంస్థకు విక్రయించారు. సాధారణంగా మూడు రోజుల్లో అకౌంట్‌లో జమ కావాలి. 20 రోజులవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎదురుచూపులు తప్పని పరిస్థితి.

కొనుగోళ్లే ఆలస్యం..

ఈసారి సోయా కొనుగోళ్ల పరంగా రైతులు మొదటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుబడులు చేతికొచ్చి ఇంట్లో నిల్వ చేసి రోజులు గడిచినా కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డెక్కి నిరస న చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎట్టకేల కు ఈనెల మొదట్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌కు పంటను వి క్రయించామన్న ఆనందం తప్పితే రైతులకు డబ్బులు చేతికి రాలేదనే ఆవేదన ఎక్కువగా కనిపిస్తోంది.

సోయా కొనుగోళ్ల వివరాలు..

సాగు విస్తీర్ణం : 68 వేల ఎకరాలు

దిగుబడి అంచనా : 5.40 లక్షల క్వింటాళ్లు

కొనుగోలు కేంద్రాలు : 10

మద్దతు ధర : రూ.5,328

పంట విక్రయించిన రైతులు : 3,098

విక్ర యించిన దిగుబడి : 66,876 క్వింటాళ్లు

అందాల్సిన డబ్బులు : రూ.35.63 కోట్లు

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుకు వచ్చిన సోయా (ఫైల్‌)

బిల్లులు పంపించాం..

సోయా విక్రయించిన రైతులకు డబ్బులు రావాల్సి ఉన్నాయి. ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంట దిగుబడుల్లో సగానికి పైగా బిల్లులు చేసి పైకి పంపించాం. అక్కడి నుంచి రాగానే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

– ప్రవీణ్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం

పైసలు రాలే.. 1
1/1

పైసలు రాలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement