ఆడపిల్లల చదువు కీలకం
ఆదిలాబాద్‌టౌన్: ఆడపిల్లల చదువు ప్రస్తుత కా లంలో ఎంతో ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర బాల ల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అర్బన్ కేజీబీ వీ, రిక్షా కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శు క్రవా రం పరిశీలించారు. కేజీబీవీలో విద్యార్థినులతో మా ట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కులను వివరించి, వాటికి భంగం కలి గితే రాష్ట్రస్థాయిలో కమిటీ ఉంటుందని అవగాహన కల్పించారు. ఆడ పిల్లలు చదువుతోనే ఉన్నతంగా రాణిస్తారని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ని ర్భయంగా తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలు, బాలల భద్రత, పోక్సో చట్టం, చైల్డ్ ప్రొటక్షన్ గురించి వివరించారు. సమస్యలు ఉంటే 1098కు స మాచారం అందించాలని సూచించారు. సీపీఆర్‌పై అవగాహన కల్పించేలా డెమో నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో కమిషన్ సభ్యులు వందన గౌడ్, అపర్ణ, సరిత, ప్రేమలత, వచన్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, సీడబ్ల్యూసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


