సిద్ధంగా ఉన్నాం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూ ర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లు 50శాతం పరిమితికి లోబడి ఉండేలా డ్రాఫ్ట్ రిజర్వేషన్లను సిద్ధం చేశాం. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఆర్డీవో, వార్డు స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీఓల ద్వారా ప్రభుత్వానికి పంపుతాం. ఈసీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చే సినా నిర్వహించేలా సర్వం సిద్ధం చేస్తున్నాం.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి


