‘నార్నూర్’ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి
కై లాస్‌నగర్: దేశంలోనే నంబర్‌వన్ ఆస్పిరేషనల్ బ్లాక్‌గా నార్నూర్ నిలవాలని కేంద్ర పర్యవేక్షణ అధికారి ప్రీతిమీనన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ పురోగతిపై కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నార్నూర్ బ్లాక్ దేశవ్యాప్తంగా టాప్–5 ఆస్పిరేషనల్ బ్లాక్‌లలో నిలవడం అభినందనీయమన్నారు. సమన్వయం, ప్రణాళికతో పని చేస్తే దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించగల సామర్థ్యం నార్నూర్‌కు ఉందన్నారు. కేంద్రం తరఫున అందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలన సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతీయ పురస్కారాలు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను ఆమె అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ, నార్నూర్ మండలంలో లబ్ధిదారుల ఆధారంగా మహువా లడ్డు యూనిట్, వెదురు ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఎన్జీవో సహకారంతో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేశామని, అలాగే ట్రైబల్ మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. అంతకు ముందు విద్య, వైద్యం, హౌసింగ్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీటి సరఫరా తదితర రంగాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. మహువా లడ్డు, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్, డీఎంహెచ్‌వో నరేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ నిధుల వినియోగంపై
కేంద్ర బృందం ఆరా
బోథ్: పీఎంశ్రీ నిధుల వినియోగానికి సంబంధించి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కేంద్ర విద్యాశాఖ బృందం శుక్రవారం సందర్శించారు. ఐఏఎస్ ప్రీతిమీనన్, కన్సల్టెంట్ గురుప్రీత్ కౌర్, ప్రభుదాస్, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్, స్టేట్ కోఆర్డినేటర్ జె.జి.జావిద్ బృందంలో ఉన్నారు. పాఠశాలకు పీఎంశ్రీ పథకం ద్వారా వచ్చిన నిధుల ఖర్చు, సామగ్రితో పాటు ఇతర అంశాలను వారు పరిశీలించారు. కొనుగోలు చేసిన పరికరాలు చాలా వరకు నాణ్యతగా లేవని గుర్తిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిధులను సరైన పద్ధతిలో వినియోగించి విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని అధికారులకు సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, పీఎంశ్రీ విభాగ పరిశీలకులు రఘురమణ, మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్, సిబ్బంది ఉన్నారు.


