
ప్రశాంతంగా సీసీల బదిలీ ప్రక్రియ
కైలాస్‌నగర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, మాస్టర్‌బుక్ కీపర్, పారాలీగల్, మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ల బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 17 మండలాల పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 107 మంది సీసీలకు కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఖాళీల ఆధారంగా సీనియారిటీ ప్రకా రం స్థానచలనం కల్పించారు. ఇద్దరు సీసీలు సస్పెన్షన్‌లో ఉండటంతో వారికి ఈ బదిలీల్లో అవకాశం కల్పించలేదు. కాగా, బదిలీ పొందిన వారంతా సె ప్టెంబర్ 1న కేటాయించిన క్లస్టర్లలో విధుల్లో చేరా ల్సి ఉంటుంది. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ స లోని చాబ్రా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాథోడ్ రవీందర్, అదనపు గ్రామీణాభివృద్ధి అధి కారి జాదవ్ గోవింద్, హెచ్‌ఆర్ మేనేజర్ టి. శ్రీని వాస్, ఏపీఎంలు స్వామి, షుద్దోద్దీన్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
సాత్నాల: విద్యార్థులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా భోరజ్ మండలం గిమ్మ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యా యామం, సమతుల ఆహారం, పరిశుభ్రత, తగినంత నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో సుభాషిని, ప్రధానోపాధ్యాయులు పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.