
ప్రతిష్టంభనకు తెర
ఫోన్‌లో కాంట్రాక్టర్లతో చర్చించిన విద్యుత్ శాఖ సీఎండీ సమస్యల పరిష్కారానికి హామీ ఆందోళన విరమించి.. పనుల్లోకి కాంట్రాక్టర్లు
కైలాస్‌నగర్: విద్యుత్‌శాఖలో ఏర్పడిన ప్రతిష్టంభన కు తెరపడింది. పెండింగ్ బిల్లుల విషయంలో ఓ అధికారి తీరు నిరసిస్తూ కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా అత్యవసర పనులకు ఇక్కట్లు తలెత్తుతున్న క్రమంలో ఆ శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఫోన్ ద్వారా కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌తో శనివారం ఉదయం చర్చలు జరిపారు. పెండింగ్ బి ల్లులతో పాటు ఇతర అంశాలన్నీ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎండీ పేర్కొన్న ట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఆందోళన విరమించినట్లు పేర్కొన్నారు. ఽశనివారం ఉదయం ఆదిలాబాద్ డీఈ ఈదన్నను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. కాగా విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ల నిరసన కారణంగా ఏర్పడిన పరిస్థితులను వివరిస్తూ ‘ముదిరిన వివాదం’, ప్రతిష్టంభన’ శీర్షికన ‘సాక్షిలో’ వరుస కథనాలు ప్రచురించిన విష యం విదితమే. ఈ మేరకు స్పందించిన ఆ శాఖ సీఎండీ నేరుగా రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో చర్చించడం గమనార్హం.