
జ్వరంతో బాలుడు మృతి
తిర్యాణి: జ్వరంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ రాము కుమారుడు సీతారాం(15) పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చికిత్స అందించినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే మండలంలోని ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.