
ఆలోచన.. ఆవిష్కరణ
కాగజ్‌నగర్‌లో విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన మేళా ఆలోచింపజేసిన చిన్నారుల ప్రాజెక్టులు శాసీ్త్రయ దృక్పథం పెంచుకోవాలని అతిథుల సూచన
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జ్ఞాన విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీ సరస్వతి శిశుమందిర్ మంచిర్యాల జిల్లా విభాగ్ కార్యదర్శి దహెగాం గోవింద్‌రావు అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లోని ఆదర్శనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త ప్ర యోగాలు, ఆవిష్కరణలకు ఊతమిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడంలో గణిత జ్ఞాన విజ్ఞాన మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం, విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించి పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయని ప్రశంసించారు. మేళాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గల నుంచి విద్యార్థులు 236 మంది హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వ తీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు తెలిపా రు. శనివారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన జి ల్లా స్థాయి విజ్ఞాన మేళాలో శార్వాణి, వెంకట రత్న, చరణ్, సాకేత్, హరిచరణ్, దివ్య, జ శ్వంత్, నిహారిక, విక్రమ్, శ్రీనిధి ఉత్తమ ప్రతి భ కనబరిచి బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యా ర్థులు సెప్టెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొంటారని వివరించారు.