
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు శనివారం ముగిసాయి. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ సైతం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి 513 అభ్యంతరాలు వచ్చాయి. ఓటరు పోలింగ్ కేంద్రాలు, వార్డు మార్పు, తప్పిపోయిన ఓటరుకు సంబంధించి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. జన్నారం మండలంలో 23, దండేపల్లిలో 104, లక్సెట్టిపేటలో 30, హాజీపూర్‌లో 12, జైపూర్‌లో 88, భీమారంలో 58, చెన్నూర్‌లో 2, కోటపల్లిలో 3, వేమనపల్లిలో 1, మందమర్రిలో 18, కాసిపేటలో 93, బెల్లంపల్లిలో 27, తాండూర్‌లో 42, భీమినిలో 5, నెన్నెలలో 7, కన్నెపల్లిలో 2 అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారం హాజీపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే సమావేశం అయ్యారు.