
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల హ్యాండ్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. బాలికల జట్టులో గంగుబాయి, మౌనిక, వైష్ణవి, పార్వతి, జయశ్రీ, సహస్ర మోక్షిత, బాలుర జట్టులో సాత్విక్, రుత్విక్‌వర్మ, జాషువా, ప్రణయ్, వంశీ, పార్థు ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి, సీనియర్ క్రీడాకారులు ప్రణయ్, సంజయ్, రఘు, వర్మ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు.