
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి
కేఆర్‌కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్
70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, ఒక కారు స్వాధీనం
ఆదిలాబాద్‌రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో ఆదివారం వేకువజామున దాదాపు 200 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. సరైన ద్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, ఒక కారును తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నార్కోటిక్ డాగ్ రోమా సాయంతో గంజాయి కోసం తనిఖీ చేయగా, ఓ ఇంట్లో మూడు మొక్కలు, 10 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. అలాగే ఓ షాపులో 29 క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ లభ్యమైనట్టు తెలిపారు. రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్ర శాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రతి ఒక్క రూ సహకరించాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూ చించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించారు. వాటి ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపించాలని సూచించారు. కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇచ్చే క్రమంలో సరైన విచారణ చేసుకోవాలని తెలిపారు. రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగరాదని, ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించడం వంటివి నిర్వహించకూడదని అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నా రు. కార్యక్రమంలో మావల సీఐ కర్రె స్వామి, పట్ట ణ సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, కె.ఫణిదర్, ప్రేమ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, రిజర్వ్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.