
బాధిత రైతులను ఆదుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: పంట నష్టపోయిన ప్రతీ రై తుకు పరిహారం అందించి ఆదుకోవాలని మా జీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మండలంలోని అంకోలి, తంతోలి, లింగుగూడ గ్రామాల శివారులో వరదతో నష్టపోయిన పంట చేలను ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట న ష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగే వర కు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. ఇంద్రవెల్లి సభలో రైతులకు ప్రీమియం కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. ఆ సభలో ఇచ్చిన ప్రతీ హామీని పూర్తి చేయకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక త ప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు జగదీష్, ప్రహ్లాద్, రా జు, సతీష్, పరమేశ్వర్, తదితరులున్నారు.