
లబాన సంఘం జిల్లా కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: మథుర లబాన సమాజ నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా మోహన్ సింగ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా సాబ్లే అమర్‌సింగ్, ఉపాధ్యక్షులుగా పడవల్ పత్తు సింగ్, పడవల్ సర్దార్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా అజాడే కేవల్ సింగ్, కార్యదర్శిగా పడవల్ నానక్‌సింగ్, పడవల్ హుషార్ సింగ్, కోశాధికారిగా బామన్ సాతల్య, ప్రచార కార్యదర్శిగా సాబ్లే సంతోష్‌సింగ్, సభ్యులుగా చౌహాన్ ప్రేమ్‌సింగ్, రాంచందర్, సలహాదారులుగా మోహన్ సింగ్, కై లాస్‌సింగ్, సూరజ్, దిగంబర్, రైమల్, సకర్వాల్ గులాబ్‌సింగ్ ఎన్నికయ్యారు.