
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
కైలాస్‌నగర్: పేదల సంక్షేమమే లక్ష్యంగా అధి కారులు నిష్పక్షపాతంగా సేవలందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలానికి చెందిన 338 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు పొసీడింగ్ పత్రాలు అందజేశారు. అధికారులు రాజకీయాలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎంపీడీవోలు స్వప్నశీల, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
భోరజ్‌లో..
సాత్నాల: భోరజ్ మండల కేంద్రంలో 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో జైన థ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల్లూరి అశోక్ రెడ్డి, తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.