
● నేత్రపర్వంగా ఎద్దుల జాతర ● తాంసిలో అధికారికంగా పొలాల
ముస్తాబైన బసవన్నలు రైతులతో ఊరంతా సందడిగా మారింది. పొలాల అమావాస్య పండుగను జిల్లాలో ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తాంసిలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి రైతులతో పాటు జనం భారీగా తరలివచ్చారు. బసవన్నల ఊరేగింపులో సంప్రదాయం పాటిస్తూ గ్రామస్తులు ఐక్యత చాటారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. – తాంసి