
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: రాజీపడదగిన కేసులు సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని కార్యాలయంలో పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ శాఖల అధికారులు, న్యాయవాదులతో శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజీపడదగ్గ కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 13న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బోథ్‌లో కోర్టు నూతన భవన నిర్మాణ పనులు పరిశీలన..
బోథ్: మండలకేంద్రంలో నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణ పనులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు శనివారం పరిశీలించారు. త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్‌రావు దేశ్‌పాండే, కార్యదర్శి శంకర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.