
ఇంద్రవెల్లి పోరాట చరిత్ర గర్వకారణం
ఇంద్రవెల్లి: భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట చరిత్ర ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమని టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్‌కుమార్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని యువతకు వివరించాలన్నారు. అలాగే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యంపై చైతన్యపర్చడం మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెస్రం నాగ్‌నాథ్, విశాల్, రమేశ్ తదితరులున్నారు.