
ఊరూరా ‘పొలాల’ సందడి
పొలాల పండుగను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన్నలను అందంగా అలంకరించి పూజలు చేశారు.
పల్లె పర్యాటకానికి కృషి
పల్లె పర్యాటకానికి ప్రాధాన్యతలో భాగంగా తాంసిలో ఈసారి అధికారికంగా పొలాల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. శ్రావణ మా సం చివరి రోజున రైతులు ప్రకృతిని ఆరాధించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఎద్దులకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పండుగకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం కోసం కలెక్టర్ సహకారంతో ఈ సారి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం.జిల్లావాసులంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
– ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు,
ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకులు