
జీవో 28 రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జీవో 28 రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్‌సింగ్, నర్రా నవీన్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలన్నీ నేరవేరుతాయని ఎన్నో కలలు గన్నామన్నారు. అయితే నాడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 20 రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఓపీఎస్ రద్దు చేస్తూ జీవో 28 జారీ చేసిందన్నారు. ఈ జీవో రద్దు కోసం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా హాజ రై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో రాష్ట అసోసియేట్ అధ్యక్షులు విఠల్ గౌడ్, కనక అభిమాన్, రాష్ట్ర కార్యదర్శి ఆర్.మోహన్ సింగ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి బాబన్న, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.