
రారండోయ్..
8లోu
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తదితరులు
పొలాల పండుగకు జిల్లాలో తాంసికి ప్రత్యేకత ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నేడు అధికారికంగా ని ర్వహించేందుకు సన్నద్ధమైంది. పల్లె పర్యాటకానికి చేయూతనివ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పండు గ గుర్తింపు పొందేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. యంత్రాంగంసహకారంతో గ్రామస్తులు సమష్టిగా ముందుకు సాగుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పా టు ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ప్రముఖుల కు ఇప్పటికే ఆహ్వానపత్రాలు అందజేశారు. జాతర కు జిల్లారైతులంతా తరలిరావాలని కోరుతున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి.....
మండల కేంద్రంలో అధికారికంగా నిర్వహించను న్న వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆద్య కళా మ్యూజియం వ్యవస్థాపకులు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు నేతృత్వం వహిస్తుండగా.. డీఆర్డీవో రవీందర్, జిల్లా ప ర్యాటక శాఖ అధికారి రవికుమార్ రెండు రోజులు గా దగ్గరుండి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రైతు ల కోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అలాగే స్థాని క కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
నేటి కార్యక్రమాలు ఇలా..
ప్రతీ ఇంటి నుంచి అలంకరించిన ఎద్దులను డప్పు చప్పుళ్ల నడుమ మధ్యాహ్నం 3గంటలకు ఆలయం వద్దకు తీసుకువస్తారు. 4గంటలకు అతిథులంతా వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. 4.30 గంటల కు గ్రామపటేల్ ఇంటి నుంచి నైవేద్యం తీసుకువస్తా రు. 5గంటలకు బసవన్నలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పూజలు చేసి తొరణం నిర్వహిస్తారు. అనంతరం రైతులు ఎద్దులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలుచేయిస్తారు. రాత్రి వరకు సాంస్కృతిక ప్రదర్శనలు కొససాగుతాయి.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు.