
అధైర్యపడొద్దు.. అండగా ప్రభుత్వం
తలమడుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని కొత్తూరు, తలమడుగు, డోర్లీ గ్రా మాల్లో పంట నష్టంను శుక్రవారం ఆయన పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ఆధారంగా బాధిత రైతులందరికీ ప్రభుత్వ పరంగా పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం డోర్లీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అలాగే తలమడుగు ఫ్యాక్స్ కేంద్రం, గోదాంను పరిశీలించి యూరియా స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉండం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంను సందర్శించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్‌మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో శంకర్, ఏవో ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గణేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సామాజిక కార్యకర్త మౌనిష్‌రెడ్డి తదితరులున్నారు.
ఆది కర్మయోగి అభియాన్‌పై కలెక్టర్ సమీక్ష
కైలాస్‌నగర్: గిరిజనుల సామాజిక మార్పు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంపై కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం ని ర్వహించిన ఆయన అమలుపై పలు సూచనలు చేశారు. అట్టడుగు స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించడం, సమాజంలో సమగ్ర పాలన వ్యవస్థ రూపొందించడం, గిరిజనుల క్రియాశీల పాత్ర పటిష్టం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నా రు. ఇందులో భాగంగా జిల్లాలోని 16 బ్లాకుల్లో 150 వెనుకబడిన గ్రామాలను గుర్తించి 17 శాఖల ద్వారా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏలో మండల, బ్లాక్ లెవెల్ స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి యాక్షన్ ప్లాన్‌ను అక్టోబర్‌లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పెసా కోఆర్డినేటర్ అర్క వసంత్‌రావ్, రవీందర్ రాథోడ్, జాదవ్ గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.