
క్షేత్రస్థాయిలో సందర్శించాలి
ఇంద్రవెల్లి: అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పైలట్ ప్రజావాణి – ప్రజా ఫిర్యాదుల బ హిరంగ విచారణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడా రు.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ పదే ళ్ల కాలంలో పేదలు రేషన్ కార్డుల కో సం నిరీక్షించారని, అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న తప్పు ల కారణంగా కొంత మంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. అధి కారులు క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూ డాలన్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధి కారులతో బహిరంగ విచారణ జరిపి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్ తదితరులున్నారు.