
యూరియా.. పాట్లు!
జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లను కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా యూరి యా కోసం ఎరువుల దుకాణాలకు పరుగు పెడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వారు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట శుక్రవారం ఉదయం నుంచే ఇలా గంటల తరబడి బారులు తీరారు. నిర్వాహకులు ఒక్కో రైతుకు మూడు బ్యాగులు మాత్రమే ఆధార్ ఆధారంగా అందిస్తున్నారు. అయితే సరిపడా యూరి యా లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓ షాపు వద్దకు వచ్చిన ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 3,600 బ్యాగులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే ఎరువు దొరకదేమోనన్న భయంతోనే రైతులు ముందస్తుగా తీసుకునేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఆ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పంట కాలానుగుణంగా ఎరువులను అందుబాటులో
ఉంచినట్లు పేర్కొన్నారు. – ఆదిలాబాద్‌టౌన్
యూరియా కోసం క్యూలో రైతులు