
అక్రమ లేఅవుట్‌పై కొరడా
కై లాస్‌నగర్: మున్సిపల్ పరిధిలోని మావల మండలం బట్టిసావర్‌గాం శివారు సర్వేనంబర్ 13,14,15 లోని అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌పై మున్సిపల్ అధికారులు కొరడా ఝు ళిపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ సర్వేనంబర్లలో 37మంది దళితులకు 38 ఎకరాల భూములను గతంలో పంపిణీ చేశారు. రూ.కోట్ల విలువైన భూములు కావడంతో వాటిపై కన్నేసిన రియల్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. 18 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్ల దందా ద్వారా రూ. కోట్ల ఆదాయం గడించారు. దీనిపై కలెక్టర్ రాజర్షిషాకు ఫిర్యాదులు రావడంతో చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, టీపీవో సుమలత, మున్సిపల్ సిబ్బందితో వాటిని పరిశీలించారు. అక్రమమని నిర్ధారిస్తూ అందులో పాతిన హద్దురాళ్లను తొలగించారు. అయితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.